స్మార్ట్‌ఫోన్‌పై టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని గతంలో అనేక పరిశోధనలు హెచ్చరించాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోస్కోప్‌లో పరిశీలించగా, ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా అందులో కనిపిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ రోజులో ఒక్కసారైనా మొబైల్ ఫోన్‌ను శానిటైజర్‌తో జాగ్రత్తగా తుడవటం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.