TG: యాదాద్రి జిల్లా, రామన్నపేట (M) నిధానపల్లి గ్రామంలో కావ్య(25) అనే వివాహిత చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వారం క్రితం అదనపు కట్నం విషయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భర్త ఈ నెల 8న కావ్యను కొట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బయటకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన కావ్య గురువారం చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.