AP: తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన చినసత్యనారాయణ(36) తన తల్లితో కలిసి ఉంటున్నాడు. మూడు నెలల కిందట ఆమె చనిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సత్యనారాయణ పనికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. తన అన్న కుమారుడికి ఫోన్ చేసి ఇక బతకలేనని చెప్పాడు. అనంతరం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.