ప్రేమోన్మాది వేధింపులు తాళలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

65చూసినవారు
ప్రేమోన్మాది వేధింపులు తాళలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
AP: ప్రేమోన్మాది వేధింపులు భరించలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అన్నమయ్య (D) రాయచోటిలో చోటు చేసుకుంది. తన కూతురును తారకరత్న ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానని బెదిరింపులకు గురిచేసినట్లు తండ్రి ఆరోపించారు. భయంతో ఆత్మహత్య చేసుకుందన్నారు. పదో తరగతిలో 554 మార్కులు వచ్చాయని, మరో రెండు రోజుల్లో కాలేజీకి వెళ్లనున్న తరుణంలో ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్