యువకుడి వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

237చూసినవారు
యువకుడి వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య
AP: తిరుపతి జిల్లాలోని తిరుచానూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. యువకుడి వేధింపులు తట్టుకోలేక 15 ఏళ్ళ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. పద్మావతిపురానికి చెందిన నవీన్‌ ఓ బాలికతో తరచూ మాట్లాడేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి నవీన్‌ను మందలించాడు. ఈ క్రమంలో గంజాయికి బానిసైన నవీన్ బాలికకు కాల్ చేసి వేధింపులకు గురి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక చీరతో ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్