TG: సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి భార్య భాగ్య ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో తట్టుకోలేక భర్త నాగరాజు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారి నలుగురు పిల్లలు అనాధలైయ్యారు. ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.