AP: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల్ని విడిచి ఉండలేక ఓ విద్యార్థిని జడ రిబ్బన తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. లావణ్య అనే బాలిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి చదువుతుంది. ఇటీవల దసరాకు ఇంటికి వెళ్లిన బాలికను పేరెంట్స్ గురువారం హాస్టల్‌కు పంపించారు. దీంతో తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.