యూపీలోని షాజహాన్ పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన కోడలిని గొడ్డలితో నరికి చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. రాజ్‌పాల్ సత్య (70) మద్యానికి బానిసై తరచూ వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం కూడా మద్యం తాగి రాగా కోడలు సుమిత్ర (30)తో గొడవ జరిగింది. దీంతో గొడ్డలి తీసుకుని కోడలిని నరికి చంపేశాడు. ఆపై తాను చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.