యూపీలోని ముజఫర్‌నగర్‌లో దారుణ ఘటన జరిగింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సిన వధువును తన సొంత మేనమామ తుపాకీతో కాల్చి చంపాడు. కైలోరా గ్రామంలో పెళ్లికి షాపింగ్ చేయడానికి వెళ్లిన హిమాన్షి (27) అనే యువతిని ఇద్దరు కుమారులతో మేనమామ చంపేశాడు. అనంతరం కారులో మృతదేహాన్ని పారవేసేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. హిమాన్షిని తన మేనమామ డబ్బులు అడగగా .. ఆమె నిరాకరించడంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.