పెళ్లి సందర్భంగా మేనమామలు పెట్టే కానుకలను ప్రత్యేకంగా భావిస్తారు. కానీ కోట్ల రూపాయల కట్నాలు పెట్టే మేనమామలు ఉంటారా? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. రాజస్థాన్‌లో ఓ యువతి పెళ్లి సందర్భంగా ఆమె మేనమామలు ఏకంగా 3 కోట్ల 21 లక్షల రూపాయల విలువైన కానుకలు పెట్టారు. ఆ యువతి, యువతి తల్లిదండ్రులు, పెళ్లికొచ్చిన బంధువులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో పాతదే అయినా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుత్తం నెట్టింట వైరలవుతోంది.