భగవద్గీత, భరత ముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్య శాస్త్రానికి చోటు దక్కింది. దీనిపై ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. ‘ఇది భారతీయ సంస్కృతి, తాత్విక వారసత్వానికి దక్కిన చారిత్రక గుర్తింపు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించ దగ్గ క్షణం ఇది.’ అని ప్రధాని మోదీ పోస్టు పెట్టారు.