TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సొంత పార్టీ నేత నుంచే ఊహించని షాక్ ఎదురైంది. జగిత్యాల పర్యటనలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పొంగులేటి ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించగా వెనకడుగు వేశారు. పరిస్థితిని అర్థం చేసుకున్న పొంగులేటి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. 'ఇక మా పని అయిపోయింది. మీ రాజ్యం మీరు ఏలండి' అంటూ జీవన్ రెడ్డి అన్నారు. కాగా పార్టీ తనకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.