నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.16,300 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. సీ-హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేయబడిన ఇథనాల్ కోసం అధిక ఎక్స్-మిల్ ధరను కేంద్రం ఆమోదించినట్లు తెలిపారు. సీ హెవీ మొలాసిస్‌తో ఉత్పత్తి చేసే ఇథనాల్ ఎక్స్‌మిల్ ధర గతంలో లీటరుకు రూ.56.28 ఉండగా.. తాజాగా రూ.57.97కి పెంచుతూ కేబినెట్ ఆమోదించింది.