ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి ఐఐటీ విస్తరణకు అనుమతి ఇచ్చింది. యూపీలో ఆరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ యూనిట్ తో 2 వేలమందికి ఉపాధి లభించనుంది. బెంగళూరు, నోయిడాలో డిస్ ప్లే చిప్స్ తయారీప్లాంట్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ.3,706 కోట్ల నిధులు కేటాయించింది. ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.