పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకున్న సరబ్ జ్యోత్ సింగ్ ను కేంద్ర క్రీడలశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభినందించారు. స్వదేశానికి చేరుకున్న సరబ్ జ్యోత్ కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అంతకుముందు, ఢిల్లీ విమానాశ్రయంలో సరబ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పారిస్ ఒలింపిక్స్ లో 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో మను బాకర్ తో కలసి సరబ్ జ్యోత్ కాంస్యం గెలుచుకున్నాడు.