బెంగాల్‌లో ఆగని ఉద్రిక్తతలు.. పోలీసు వాహనం దగ్ధం

83చూసినవారు
బెంగాల్‌లో ఆగని ఉద్రిక్తతలు.. పోలీసు వాహనం దగ్ధం
వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో హింస ఆగడం లేదు. సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో చట్టం అమలు చేయమని స్పష్టం చేసినా ఆందోళనకారులు శాంతించడం లేదు. గొడవల్లో ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పోలీసు వాహనాలు సైతం దగ్ధం అయ్యాయి. ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకోవడంతో కేంద్రం ఏకంగా పోలీస్ బలగాలను రంగంలోకి దింపింది.

సంబంధిత పోస్ట్