ఉత్తర ప్రదేశ్ మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జాతికి క్షమాపణ చెప్పాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వ వైఫల్యం వలనే ఈ తొక్కిసలాట జరిగిందని రామకృష్ణ వ్యాఖ్యానించారు. కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.