భీమ్, జీపే, పేటీఎం, ఫోన్ పే.. ఇలా ప్లాట్ఫామ్ ఏదైనా డబ్బులు ఖాతాలు మారేది UPI ద్వారానే. అయితే కొన్ని UPI లావాదేవీలు ఫెయిల్ అవుతుంటాయి. మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీలో సమస్యలు ఉంటే లావాదేవీలు ఫెయిల్ అవుతాయి. బ్యాంకు సర్వర్లు సరిగ్గా పనిచేయని సమయంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. UPI పిన్ తప్పుగా ఇచ్చినా, బ్యాంకు ఖాతాలో అవసరమైనన్ని డబ్బులు లేకపోయినా, ట్రాన్సాక్షన్ లిమిట్ మించినా పేమెంట్ ఫెయిల్ అవుతుంది.