రేపటి నుంచి మరింత వేగంగా యూపీఐ లావాదేవీలు

67చూసినవారు
రేపటి నుంచి మరింత వేగంగా యూపీఐ లావాదేవీలు
ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వాడే వారికి గుడ్ న్యూస్. రేపటి (జూన్ 16) నుంచి యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులకు NPCI మార్గదర్శకాలు జారి చేసింది. దీంతో యూపీఐ లావాదేవీల సమయం 50 శాతం మేర తగ్గనుంది. క్రెడిట్/డెబిట్‌కు సంబంధించిన లావాదేవీలకు ప్రస్తుతం 30 సెకన్లు పడుతుండగా.. ఇప్పడు కేవలం 15 సెకన్లలోనే పూర్తవుతాయి. ట్రాన్జాక్షన్ స్టేటస్, అడ్రస్ వ్యాలిడేషన్ కు కూడా 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు తగ్గనుంది.

సంబంధిత పోస్ట్