UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల అడ్మిట్ కార్డులు అధికారికంగా విడుదలయ్యాయి. అభ్యర్థులు వాటిని https://upsconline.gov.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ప్రిలిమ్స్ పరీక్ష మే 25న జరగనుంది. ఈ పరీక్ష ద్వారా IAS, IPS, IFS సహా ఇతర ప్రముఖ సర్వీసుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈసారి మొత్తం 1,129 ఖాళీలు ఉన్నట్లు సమాచారం.