వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌పై UPSC షాక్ ఇచ్చింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేశారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం పూజపై UPSC కేసు నమోదు చేసింది. ఆమె సివిల్ సర్వీసెస్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడానికి షోకాజ్ నోటీసు (SCN) జారీ చేసినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో UPSC నిర్వహించే పరీక్షల్లో పాల్గొనకుండా నిషేధించనుంది.