మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో డిసెంబర్ 13న విషాద ఘటన జరిగింది. దుప్పట్లు విక్రయించే 18 ఏళ్ల యువకుడు తన స్నేహితుల ముందు స్టంట్స్ చేశాడు. దుప్పట్లపై పల్టీ కొట్టాడు. ఆ సమయంలో పొరపాటున అతడి తల నేలకు తాకింది. అపస్మారక స్థితికి చేరుకున్న బాధిత యువకుడిని అతడి స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మెడ విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు చనిపోయాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.