కొబ్బరి సాగులో సేంద్రీయ ఎరువులు వినియోగించటం వల్ల కొబ్బరి పంటతోపాటు, రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా తేలిక నేలల్లో తేమను ఎక్కువ కాలం ఉండేట్లు చేయటంలో సేంద్రీయ ఎరువులు సహాయకారిగా ఉంటాయి. భూమిలో ముఖ్యపదార్ధమైన సేంద్రీయ కర్బనం పెరిగేలా చేస్తుంది. భూమిలో సూక్ష్మజీవుల సంతతి పెంచి, తద్వారా మట్టిలో మొక్కల వేర్లను పోషకాల లభ్యత పెంచుతుంది.