తెలంగాణలో లైసెన్స్ లేకుండా దగ్గు మందు తయారు చేస్తున్న వారిపై అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో అఖిల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో తాజాగా తనిఖీలు నిర్వహించారు. వారు నాణ్యత లేని 'Glycoril Cough Syrup' అనే సిరప్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సిరప్ ఆరోగ్యానికి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి మందులు కనిపిస్తే 1800-599-6969 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.