తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ప్రతిష్టాత్మకంగా భూభారతి పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా సోమవారం CM రేవంత్, మంత్రి పొంగులేటి ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. ఇక యూజర్లకు సెకన్లలో భూభారతి పోర్టల్ యాక్సెస్ అవుతోంది. ఇప్పటి వరకూ పోర్టల్‌ను 50 వేలకు పైగా యూజర్లు యాక్సెస్ చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పోర్టల్ జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.