తెలంగాణ సమాచార కమిషనర్‌గా వైష్ణవి నియామకం

73చూసినవారు
తెలంగాణ సమాచార కమిషనర్‌గా వైష్ణవి నియామకం
TG: రాష్ట్ర సమాచార కమిషనర్‌గా వైష్ణవి మెర్లను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఆర్టీఐ కమిషనర్లుగా బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ. శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్‌, దేశాల భూపాల్ పేర్లను ఖరారు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరొకరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు వైష్ణవి పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్