ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే వాలంటైన్ వీక్‌లో మొదటి రోజైన 'రోజ్ డే'ను శుక్రవారం నాడు ప్రేమికులంతా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక రెండవ రోజైన ఫిబ్రవరి 8వ తేదీన ప్రపోజ్ డే సెలెబ్రేట్ చేసుకునేందుకు ప్రేమికులు సిద్ధంగా ఉన్నారు. ప్రపోజ్ డే రోజును తమకు ఇష్టమైన వారికి ప్రపోజ్ చేయడానికి ప్రత్యేకమైనదిగా భావిస్తారు. చాలా మంది వారికి ఇష్టమైన వారికి తమ ప్రేమ గురించి చెబుతుంటారు.