వచ్చే నెల 1 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్

70చూసినవారు
వచ్చే నెల 1 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరి షాక్ తగిలింది. ఆయనను పీటీ వారెంట్ పై అరెస్ట్ చేసి గన్నవరం కోర్టులో హాజరుపరచగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది. అనంతరం వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో పరుపు ఏర్పాటు చేయించాలని వంశీ న్యాయమూర్తిని కోరినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్