గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో చుక్కెదురైంది. వంశీపై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఆయనపై మరిన్ని పాత కేసులను ఓపెన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గన్నవరం టీడీపీ ఆఫీసుపై కేసులో జైలులో ఉన్న వంశీకి రేపటితో రిమాండ్ ముగియనుండటంతో సీఐడీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కస్టడీలో ఉన్న వ్యక్తిపై మరో కేసు నమోదు చేస్తే కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు పీటీ వారెంట్ జారీ చేస్తారు.