TG: వన ప్రేమికుడు, పద్మశ్రీ దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు వనజీవి రామయ్య అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై నివాళులర్పించనున్నారు. రెడ్డిపల్లిలో వనజీవి రామయ్య కుటుంబంతో నివాసముంటున్నారు.