TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమాన్ని రేపు ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖా మంత్రి కొండా సురేఖతో పాటు అటవీ దళాల ప్రధానాధికారి డా. సువర్ణ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ప్రకృతి విధ్వంసం నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నారు.