శునకాన్ని ఢీకొనడంతో నిలిచిపోయిన వందేభారత్‌ రైలు

137చూసినవారు
శునకాన్ని ఢీకొనడంతో నిలిచిపోయిన వందేభారత్‌ రైలు
శునకాన్ని ఢీ కొనడంతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్ సమీపంలో దాదాపు 20 నిమిషాలకు పైగా నిలిచిపోయింది. ఆదివారం సాయంత్రం చీరాల వైకుంఠపురం రైల్వే గేటు సమీపంలో విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌.. పట్టాలు దాటుతున్న శునకాన్ని ఢీకొట్టింది. దీంతో శునకం కళేబరం ఇంజిన్‌ ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో రైలు నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది వచ్చి శునకం కళేబరాన్ని బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్