తెలుగు రాష్ట్రాలకు వందే భారత్‌ రైళ్లు.. మంత్రి కీలక ప్రకటన

63చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు వందే భారత్‌ రైళ్లు.. మంత్రి కీలక ప్రకటన
తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్‌ రైళ్లు నడుపుతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. తెలంగాణ నుంచి ప్రస్తుతం 5 వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయని అన్నారు. ఏపీకి 200 వందే భారత్‌, 100 నవ భారత్‌ రైళ్లను ఇవ్వడానికి కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. అమృత్‌ భారత్‌ రైళ్లు రూ.450కే 1,000 KM పయనించేలా అవకాశం కల్పిస్తామన్నారు. త్వరలో వంద అమృత్‌ భారత్‌ రైళ్లను తీసుకొస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్