ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో నేడు వసంత పంచమి సందర్భంగా అమృతస్నానాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే త్రివేణీ సంగమంలో భక్తుల రద్దీ మొదలైంది. రాత్రి సమయానికి దాదాపు 2 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా చేశారు. మరోవైపు, వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమం వద్ద భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు.