TG: తెలంగాణలోని రైతు వేదికల్లో ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్సింగ్-వీసీ సౌకర్యం విస్తరించనుంది. రాష్ట్రంలో మొత్తం 2601 రైతు వేదికలు ఉండగా.. ప్రస్తుతం 500 చోట్ల VC సదుపాయం ఉంది. కొత్తగా మరో వెయ్యి కేంద్రాల్లో ఈ సౌకర్యం కల్పించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేయగా అందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఇదే సంవత్సరంలో మిగిలిన 1101 రైతు వేదికల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.