సృష్టిలో ఎన్నో జీవచరాలు ఉన్నాయి. ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఇందులో ఆక్టోపస్ కూడా ఒకటి. అయితే, ఓ ఆక్టోపస్ మాత్రం చాలా డేంజర్. శరీరంపై నీలి రంగులతో చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది ఈ ఆక్టోపస్. పొరపాటున దీని జోలికి వెళ్తే మాత్రం ఒక్కసారిగా విషాన్ని చిమ్ముతుంది. ఈ విషం 26 మంది మనుషుల్ని చంపగలదు. ఒక్కసారి విషాన్ని ప్రయోగిస్తే ఎంత ఆరోగ్య వంతుడైనా 20 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవాల్సిందే.