గుజరాత్‌లోని ఛోటా ఉదయ్‌పూర్‌లో మంగళవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఎస్‌యూవీ కారు అతి వేగంతో రోడ్డు పక్కనే ఉన్న దాబాలోకి దూసుకెళ్లింది. సదరు కారు అదుపుతప్పి దాబాలో కూర్చుని భోజనం తింటున్న వ్యక్తులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకోగా.. ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.