యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ SC, BC బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకస్మిక పర్యటన చేసిన చేశారు. విద్యార్థులకు అందుతున్న మెనూ, కాస్మోటిక్ ఛార్జీల వివరాలను అడిగి తెలుసుకొని విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. డైట్ చార్జీలు పెంచక ముందు, పెంచిన తర్వాత మెనూలో వచ్చిన మార్పులు.. నాణ్యత పాటిస్తున్నారా? లేదా? శుభ్రత ఎలా ఉంది? ఇలా అన్ని విషయాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.