ఆకలితో ఉన్న పసివాడు మరో వ్యక్తి ఆకలితో ఉండటం చూసి తన దగ్గరున్న ఆహారాన్ని ఇచ్చేయడం అందరి హృదయాల్ని కదిలిస్తుంది. ఆకలి విలువ తెలిసినవాడే ఆహారాన్ని పంచుకుంటాడు అనేదానికి ఉదాహరణగా ఈ వీడియో నిలుస్తోంది. చిరిగిపోయిన దుస్తులతో, పాపం సరైన తిండి కూడా దొరకని ఆఫ్రికా పేదలకు కొంతమంది దాతలు ఆహారాన్ని సరఫరా చేశారు. ఆ సమయంలో తనకూ పెట్టమని ఓ వ్యక్తి అడగ్గా ఓ బాలుడు తన వద్ద ఉన్నదంతా ఇచ్చేయడం హృదయాన్ని ద్రవింపజేస్తుంది.