VIDEO: భూ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు

61చూసినవారు
TG: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. భూ సర్వే చేయడానికి వచ్చిన అధికారులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములను సర్వే చేయడానికి అధికారులు వచ్చారు. దీంతో గ్రామస్తులు, రైతులు అధికారులను అడ్డుకోవడంతో వారు వెనుదిరిగి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్