యూపీలోని జలౌన్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళా నర్సు డ్యూటీ నిమిత్తం స్కూటర్‌పై పీహెచ్‌సీకి వెళ్తోంది. మార్గమధ్యంలో నలుగురు వ్యక్తులు బైకుపై వచ్చి ఆమెను ఢీకొట్టి కిందపడేలా చేసి.. ఆ తర్వాత ఆమెను అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో కర్ర, కారం పొడిని చొప్పించి చిత్రహింసలకు గురి చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.