VIDEO:బాలికపై వీధికుక్కల దాడి

81చూసినవారు
చిన్న పిల్లలను పెద్దలు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. పిల్లలను ఆరుబయట నిర్లక్ష్యంగా వదిలితే వారికి ఊహించని రీతిలో ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదే కోవలో గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఓ బాలిక ఇంటి బయట ఉండగా రెండు వీధికుక్కలు వచ్చాయి. ఆ బాలికపై ఆ కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి. దీంతో ఆ బాలిక భయంతో పరుగులు తీసింది. చిన్నపాటి గాయాలతో ఆ బాలిక తప్పించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్