VIDEO: 30 ఫీట్ల ఎత్తు నుంచి పడిపోయిన బాలిక

77చూసినవారు
జిప్‌లైన్ రైడ్‌ చేస్తూ 30 ఫీట్ల ఎత్తు నుంచి పడి మహారాష్ట్రకు చెందిన 12 ఏళ్ల బాలిక తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జరిగింది. విహారయాత్ర కోసం ఫ్యామిలీతో కలిసి మనాలికి వెళ్లిన త్రిష (12) అనే బాలిక జిప్లైనింగ్ చేస్తుండగా బెల్ట్ తెగిపోవడంతో 30 ఫీట్ల ఎత్తు నుంచి కింద పడిపోయింది. దీంతో బాలిక కాలు విరిగినట్లు సమాచారం. ఈ ఘటన ఈ నెల 8న జరగగా తాజాగా వీడియో బయటకి వచ్చింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్