పెళ్లి చూసేందుకు వచ్చి.. ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్ లో ఓ యువకుడు తమ బంధువుల పెళ్లికి వచ్చి అక్కడ డాన్స్ చేస్తోన్న ఆర్కెస్ట్రా యువతితో ప్రేమలో పడ్డాడు. వెంటనే, అక్కడున్న కుంకుమను తీసుకొని స్టేజీ మీదకు వెళ్లిపోయాడు. ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకొని సుదిటిపై కుంకుమ పెట్టాడు. అక్కడి ఆచారం ప్రకారం నుదిటిపై కుంకుమ పెడితే పెళ్లి జరిగినట్లే.