హైడ్రా కూల్చివేతలు మళ్ళీ షురూ అయ్యాయి. హైదరాబాద్‌లో ఆదివారం ఓ భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న 6 అంతస్థల భవనాన్ని కూల్చివేసింది. కాగా, ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి సా.5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.