ఆయన కవిత్వ
ం ఎగసిపడే నిప్పురవ్వ, అతడో ఎగిరే ధిక్కార పతాకం, పెత్తందారుల గుండెల్లో దడ, అతడే ప్రజాకవి కలేకూరి ప్రసాద్.
సామాజిక కార్యకర్తగా, ఉద్యమశీలిగా, మేధావిగా, కవిగా, రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, ప్రజా పాత్రికేయుడిగా అన్నింటికంటే ఉత్తమమైన మానవతావాదిగా కలేకూరి ప్రస్థానం బహుముఖ విస్తృతం. కలేకూరి ప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఆయన మాటల్ని గుర్తుచేసుకుందాం.