VIDEO: ప్రేమనే కాదు.. కాలేయం పంచి.. భర్తకు ప్రాణం పోసింది

81చూసినవారు
ఏడడుగులు కలిసి నడిచిన భర్త కోసం ఆమె తన కాలేయాన్ని దానం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన ధరావత్‌ శ్రీనుకు కాలేయం పాడైంది. ప్రాణాలతో ఉండాలంటే కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. భర్తను బ్రతికించు కోవడానికి.. లావణ్యే ముందుకొచ్చింది.16న శస్త్రచికిత్స చేసిన వైద్యులు లావణ్య శరీరం నుంచి తీసిన 65 శాతం కాలేయాన్ని శ్రీనుకు అమర్చారు. ప్రస్తుతం ఇద్దరు కోలుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్