కుంభమేళా నేపథ్యంలో యూపీలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఫిబ్రవరి 8న తెల్లవారుజామున వారణాసి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైలు ప్లాట్‌ఫారమ్ వద్ద నిలిచి ఉంది. అన్ని కంపార్ట్‌మెంట్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. దీంతో సుమారు 20 మంది ప్రయాణికులు రైలు ఇంజిన్ క్యాబిన్‌లోకి ఎక్కారు. లోపల నుంచి డోర్ లాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.