VIDEO: కింద పడ్డ అన్నం ఎత్తలేదని 11 ఏళ్ళ బాలికను ఘోరంగా కొట్టాడు

71చూసినవారు
బెంగళూరులోని తానిసండ్ర మదర్సాలో దారుణ ఘటన జరిగింది. కిందపడ్డ అన్నం ఎత్తలేదని 11 ఏళ్ల బాలికను నిర్వహకుడి కొడుకు మహమ్మద్ హసన్ చావబాదాడు. ఈ క్రమంలో కోపం అణుచుకోలేక ఆమెను జాలి లేకుండా కాలితో తన్నాడు. ఫిబ్రవరి 16వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీంతో బాలిక పేరెంట్స్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.