యూపీలోని బిజ్నోర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సర్ఫరాజ్ (26) ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రి జనరేటర్‌లో డీజిల్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. ఆ సమయంలో యువకుడి తల్లి తన కొడుకుని కాపాడండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.